ప్రజల కోణంలో ఆలోచించే వ్యక్తి కేసీఆర్

by Shyam |
Minister Niranjan Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో : పట్టుదల, తపన ఉంటే ఏదైనా సాధ్యమేనని, మానవ సమాజంలో అవసరం, అనివార్యతను బట్టి ఆవిష్కరణలు వస్తాయని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. నీటిపారుదల రంగ నిపుణుడు, ప్రభుత్వ మాజీ సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావు జయంతిని పురస్కరించుకుని ఆదివారం ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్ లో 5వ తెలంగాణ ఇరిగేషన్ డేను
తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్, హైదరాబాద్ ఇంజనీర్స్ అసోసియేషన్, తెలంగాణ ఇరిగేట్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ అసోసియేషన్, తెలంగాణ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అసోసియేషన్ , తెలంగాణ ఇంజనీర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇరిగేషన్ అభివృద్ధికి విద్యాసాగర్ రావు చేసిన సేవలు అనన్య సమాన్యం అన్నారు. వయసుతో సంబంధం లేకుండా అందరీతో స్నేహపూర్వకంగా ఉండేవారని కొనియాడారు. సాహిత్య అభిలాష, ప్రవేశం ఉన్న వ్యక్తి విద్యాసాగర్ రావు అని అన్నారు. ప్రజల కోణంలో ఆలోచించి తపన పడితే వచ్చే ఆవిష్కరణలు అద్భుతాలుగా నిలుస్తాయి.. దానికి సీఎం కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఉదాహరణ అన్నారు. తెలంగాణలో చుక్కచుక్క నీటిని ఒడిసిపట్టిన ఘనత సోషల్ ఇంజనీర్, పొలిటికల్ ఇంజనీర్, ఫీల్డ్ ఇంజనీర్ సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైందన్నారు. ఒక్కో ప్రభుత్వంలో ఒక్కో శాఖ ప్రాముఖ్యత సంతరించుకుంటది.. పోయిన ప్రభుత్వంలో నీటి పారుదల శాఖ.. ఇప్పుడు వ్యవసాయ శాఖకు ఆ ప్రాముఖ్యత ఉందని పేర్కొన్నారు.

అనంతరం సాగునీటి రంగంలో ఉత్తమ సేవలు అందజేసినందుకు జగిత్యాల చీఫ్‌ ఇంజినీర్‌ సుధాకర్‌రెడ్డి, ఇంటర్‌స్టేట్‌ వాటర్‌ రిసోర్స్‌ విభాగం సీఈ కోటేశ్వర్‌రావు, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీఈఈ నీలిమ లకు అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ (టీఎస్‌డబ్ల్యూఆర్‌డీసీ) చైర్మన్‌ వి.ప్రకాశరావు, ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్, తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.దామోదర్ రెడ్డి, తెలంగాణ ఇంజనీర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ టి.వెంకటేశం, తెలంగాణ ఇరిగేషన్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ న్యూనే శ్రీధర్, హైదరాబాద్‌ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ (హెచ్‌ఈఏ) అధ్యక్షుడు ఏఎస్‌ఎన్‌ రెడ్డి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సీఎం ఓఎస్ డీ శ్రీధర్ రావు దేశ్ పాండే, బ్రహ్మారెడ్డి, రమణానాయక్, వెంకట సుబ్బయ్య, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed