- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
బీజేపీని చూస్తే కేసీఆర్‌కు వెన్నులో వణుకు పుడుతోంది: దుబ్బాక ఎమ్మెల్యే
by Shyam |

X
దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కారు తీరుపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫైరయ్యారు. బీజేపీ నాయకులు రైతుల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుంటుంటే కేసీఆర్ వెన్నులో వణుకు పుడుతోందని తెలిపారు. శాంతిభద్రతలను కాపాడటంలో కేసీఆర్ సర్కార్విఫలమైందని మండిపడ్డారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వాహన శ్రేణిపై టీఆర్ఎస్గూండాల దాడిని ఆయన ఖండించారు.
ఈ దాడులు పూర్తిగా కేసీఆర్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయని ఆరోపించారు. రైతులకు టీఆర్ఎస్చేసిన మోసం, దగా పూర్తిగా అర్థమైందని అన్నారు. టీఆర్‌ఎస్‌పై రైతులు, ప్రజలు, బీజేపీ కార్యకర్తలు తిరగబడే రోజు ఆసన్నమైందని వెల్లడించారు. రైతులకు చేసిన మోసాలకు కేసీఆర్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. పోలీసులు కేసీఆర్ సర్కారుకు భయపడి చేష్టలుడిగి చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story