కవిత ఈజ్ బ్యాక్.. అన్నకు పోటీగా కొత్త టీమ్

by Anukaran |
కవిత ఈజ్ బ్యాక్.. అన్నకు పోటీగా కొత్త టీమ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీఆర్​ఎస్​లో మరో టీం రెడీ అయింది. ఇప్పటి వరకు నిజామాబాద్​ జిల్లాకే పరిమితమైన మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ కవిత టీం ఇప్పుడు రాష్ట్రమంతా దూకుడు పెంచాలని భావిస్తోంది. ప్రధానంగా సోషల్​ మీడియా వేదికగా కవితకు చెందిన ప్రతి అంశాన్ని వైరల్​ చేయనున్నారు. కవిత సోదరుడు, మంత్రి కేటీఆర్​ తరహాలోనే సోషల్​ మీడియాను ప్రధానంగా వాడుకునేందుకు థర్డ్​ టీం రెడీ అవుతోంది. దీనికోసం 25 మందితో ఒక బృందాన్ని సిద్ధం చేశారు.

స్పీడప్​

కొద్దిరోజుల నుంచి వార్తల్లో, సోషల్​ మీడియాలో కవిత వెనకబడ్డారు. ఒక విధంగా రాజకీయాల్లోనే కవిత నెమ్మదించారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఢిల్లీ పరిణామాల తర్వాత కవితకు స్థానిక సంస్థల మండలి తరపున మళ్లీ అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు నిజామాబాద్​ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పరిణామాల తర్వాత కవిత వర్గంలో కొంత ఊపు వచ్చింది. వాస్తవంగా కొన్ని సంఘాలకు, యువజన సంఘాలకు కవిత గౌరవాధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. ఇటీవల సింగరేణిలో టీబీజీకేఎస్​ గౌరవాధ్యక్షురాలిగా మళ్లీ ఎన్నుకున్నట్లు ఆ సంఘం ప్రకటించింది. అదేవిధంగా అంగన్​వాడీ టీచర్స్​, సిబ్బంది యూనియన్​, సెర్ప్​ ఉద్యోగుల సంఘం వంటి సంఘాలకు గతంలో కవిత గౌరవాధ్యక్షురాలిగా ఉన్నా.. దాదాపు ఏడాదిన్నర కిందట నుంచి పెద్దగా యాక్టివ్​గా లేరు.

ప్రస్తుతం ఈ సంఘాలు మళ్లీ కవిత పేరుతో కార్యక్రమాలను మొదలుపెట్టాయి. ఇటీవల సెర్ప్​ ఉద్యోగుల సంఘం కవితను కలిసి మళ్లీ ఆ సంఘానికి నాయకత్వం వహించాలని కోరారు. అంతేకాకుండా ఇటీవల వారికి పీఆర్సీ అంశంలో కవిత చేసిన ప్రయత్నమే అంటూ ప్రచారం చేశారు. తాజాగా ఎమ్మెల్సీగా ఎన్నిక తర్వాత నుంచి సోషల్​ మీడియాలో దూకుడు పెంచారు.

25 మంది అదే పని..!

దీనికితోడుగా సోషల్​ మీడియా కవిత టీం కూడా మళ్లీ యాక్టివ్​గా మారింది. ప్రస్తుతం ఎలాంటి సంఘటనలు, శుభాకాంక్షలు వంటి వాటిని ఎక్కువగా వైరల్​ చేసుకుంటోంది. ప్రస్తుతం సోషల్​ మీడియా వేదికగానే కవితను ఈ టీం ప్రజెంట్​ చేస్తోంది. ఇక నుంచి మంత్రి కేటీఆర్​కు ధీటుగా కవితకు సంబంధించిన అంశాలను సోషల్​ మీడియాలో వైరల్​ చేసేందుకు 25 మందితో ప్రత్యేక బృందం ఏర్పాటైంది. ఈ బృందానికి హైదరాబాద్​కు చెందిన ఓ యువ నాయకుడు నాయకత్వం వహిస్తున్నాడు.

అంతేకాకుండా త్వరలో ప్రతి వారం సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్సీ కవిత నెటిజన్ల ముందుకు రానున్నారు. రాష్ట్రానికి చెందిన పలు అంశాలపై వారం వారం సోషల్​ మీడియాలో మాట్లాడనున్నారు. నెటిజన్ల నుంచి వచ్చిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వనున్నారు. ఆస్క్​ కేటీఆర్​ తరహాలోనే.. “ సోషల్​ మీడియా.. ఆన్సర్​ ఫ్రమ్​ కవిత’ అనే తీరుతో ఓ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. త్వరలోనే దీన్ని విస్తృతంగా ప్రచారానికి తీసుకురానున్నారు.

మంత్రి కేటీఆర్ క్లారిటీతో పుట్టా మధుకి లైన్ క్లియర్

Next Story

Most Viewed