వయసు పెరగడం పాపమా?.. నటి కవిత సంచలన వ్యాఖ్యలు

by Shyam |
Kavita-Kaushik
X

దిశ, సినిమా : ఏక్తాకపూర్ నిర్మించిన ‘కుటుంబ్’ సీరియల్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నటి కవితా కౌశిక్.. సోషల్ మీడియా పిక్ కారణంగా ట్రోల్స్ ఎదుర్కొంటోంది. ఇటీవలే తన న్యూ పిక్చర్‌ షేర్ చేయగా.. మేకప్‌తో ఏజ్ కవర్ చేసుకుందనే అర్థంతో ఒక ట్విట్టర్‌ యూజర్ చేసిన కామెంట్‌కు ఈ బిగ్ బాస్ 14 కంటెస్టెంట్ రెస్పాండ్ అయ్యింది.

ముఖానికి ఎటువంటి రెడ్ లీష్ వాడలేదన్న కవిత.. లిప్ బామ్ తప్ప, అసలు మేకప్ జోలికే వెళ్లలేదని తెలిపింది. ఇదే క్రమంలో తన ఏజ్‌‌ గురించి అవహేళన చేయడంపై.. ‘మీ పేరెంట్స్ కూడా ముసలివాళ్లు అయ్యేఉంటారు కదా! ఏం చేద్దాం మరి? ఈ దేశంలో వయసు పెరిగితే ఏమైనా పాపమా? 40 ఏళ్లు దాటితే నా లైఫ్ ఎందుకూ పనికిరాదని ప్రొఫైల్ పిక్చర్ ద్వారా పిల్లలకు నేర్పించాలనుకుంటున్నారా? అంటూ సమాధానమిచ్చింది. కాగా కవితా కౌశిక్ బేఫిట్టింగ్ రిప్లయ్ పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisement

Next Story