స్వస్థలానికి కత్తి మహేశ్ పార్థివదేహం.. అంత్యక్రియలు ఎప్పుడంటే..?

by Shyam |   ( Updated:2021-07-11 01:51:35.0  )
katthi mahesh
X

దిశ, ఏపీ బ్యూరో : సినీనటుడు, దర్శకుడు, సినీ విమర్శకుడు కత్తి మహేష్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన కత్తి మహేశ్‌ చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. అయితే కత్తి మహేశ్ అంత్యక్రియలు సోమవారం నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గం ఎర్రవారిపాలెం మండలం ఎల్లమందలో ఆయన అంత్యక్రియలు జరుగనున్నట్లు బంధువులు తెలిపారు. ఆదివారం సాయంత్రం కత్తి మహేష్ పార్థివదేహాన్ని చెన్నై నుండి ఎల్లమందకు చేరుకోనుంది. సోమవారం ఉదయం కత్తి మహేశ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Advertisement

Next Story