- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరణ్, షారుఖ్ పాలిటిక్స్.. మరో ప్రాజెక్ట్ నుంచి కార్తీక్ ఔట్
దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ మరో ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడని తెలుస్తోంది. ఈ మధ్యే ‘దోస్తానా 2’ మూవీకి గుడ్‌బై చెప్పిన కార్తీక్.. చిత్ర నిర్మాత కరణ్ జోహార్‌తో పాటు జాన్వీ కపూర్‌తో రిలేషన్ సరిగ్గాలేక బయటకు వచ్చేసినట్లు సమాచారం. దీంతో ధర్మ ప్రొడక్షన్‌లో కార్తీక్‌ను ఎప్పటికీ తీసుకోబోమని కరణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, తాజాగా షారుఖ్ ఖాన్ ప్రొడక్షన్ హౌజ్(రెడ్ చిల్లీస్)లో తెరకెక్కనున్న సినిమాకు కూడా కార్తీక్ ‘నో’ చెప్పినట్లు తెలుస్తోంది. కత్రినా కైఫ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు రెండేళ్ల క్రితమే సైన్ చేసిన కార్తీక్.. డైరెక్టర్ అజయ్ భల్‌తో క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా సినిమా చేయనని చెప్పేశాడట.
అంతకు ముందు చెప్పిన స్టోరీ లైన్‌కు ఇప్పుడు డెవలప్ చేసిన స్క్రిప్ట్‌కు సంబంధం లేదనే తను ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇక లాక్‌డౌన్‌లో క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ‘ధమాకా’ మూవీ చేసిన ఈ బీటౌన్ హీరో.. మళ్లీ అదే జోనర్‌లో మూవీ చేసేందుకు ఇంట్రెస్ట్ లేదని రెడ్ చిల్లీస్‌కు వివరించాడని, ఇందుకు సంస్థ కూడా ఓకే చెప్పగా అడ్వాన్స్‌గా తీసుకున్న రెండు కోట్లు వెనక్కి ఇచ్చేశాడని సమాచారం. అయితే కరణ్, షారుఖ్ కలిసి గేమ్ ప్లే చేస్తున్నారని, అందుకే కార్తీక్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుని ఉంటాడని అభిమానులు కామెంట్ చేస్తుండటం గమనార్హం.