షారుఖ్ సర్.. నా కబురు అందిందా? : ఆర్యన్

బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్.. ఫ్యాన్ మూమెంట్ పిక్ షేర్ చేశాడు. 2008 ముంబై మారథాన్‌లో పాల్గొన్న తను.. భారీ కేడ్స్ తోసుకుని వచ్చి మరీ.. సాగరిక ఘడ్జ్‌తో ఫోటో తీసుకున్నట్లు చెప్పాడు. ఆ టైమ్‌లో షారుఖ్ ఖాన్‌ను అడిగానని చెప్పమన్నట్లు చెప్పానన్న కార్తీక్ ఆర్యన్.. ‘షారుఖ్ సార్ ఆ విషయం మీకు చెప్పిందా? లేదా?’ అని ట్విట్టర్ వేదికగా అడిగాడు.

ఒక ఫ్యాన్ నుంచి హీరో వరకు కార్తీక్ జర్నీని శభాష్ అంటున్న నెటిజన్లు.. మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుతున్నారు. ఇక లాక్‌డౌన్ సమయంలో కార్తీక్ ఆర్యన్ తన తల్లితో కలిసి ఎంత అల్లరి చేశాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదే టైమ్‌లో కరోనా జాగ్రత్తలు చెప్తూ మంచి మెసేజ్ వీడియోస్ కూడా సెండ్ చేశాడు కార్తీక్ ఆర్యన్.

Advertisement