సోషల్ మీడియా పోస్ట్ నిర్వాకం.. నిమ్మకాయతో ఆ ప్రయోగం చేసి..

by Anukaran |   ( Updated:2021-04-29 06:53:31.0  )
సోషల్ మీడియా పోస్ట్ నిర్వాకం.. నిమ్మకాయతో ఆ ప్రయోగం చేసి..
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ కరోనా నుండి బయటపడాలంటే ఆ ఫుడ్ తినండి.. ఈ రసం తాగండి.. ఈ వ్యాయామాలు చేయండి.. ఈ యోగాసనాలు చేయండి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువలా వస్తున్నాయి. కొంతమంది లైక్స్ కోసం, పాపులారిటీ ని పెంచుకోవడం కోసం ఏవేవో రెమిడీస్ పేరు చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వాటిని గుడ్డిగా నమ్మి అందులో నిజమెంతో, అబద్దమెంతో తెలుసుకోకుండా వాటిని ప్రయత్నించి ప్రమాదాల బారిన పడుతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో వచ్చిన ఒక పోస్ట్ ఓ వ్యక్తి ప్రాణం తీసింది. ఈ దారుణ ఘటన కర్ణాటక లో చోటుచేసుకుంది.

రాయచూరు జిల్లాలో బసవరాజ్(43 ) టీచర్ గా పనిచేస్తున్నాడు. కరోనా కావడంతో ఇంట్లోనే ఆన్ లైన్ క్లాసులు బోధిస్తున్నాడు. అయితే కరోనా కాలంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వచ్చే అన్నింటిని జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండేవాడు. కొద్దీ రోజుల క్రితం ముక్కులో నిమ్మరసం పిండుకొంటే కరోనా రాదని ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అలాచేస్తే ఊపిరితిత్తులో ఇన్ఫెక్షన్ రాదని, దాని ద్వారా కరోనా వచ్చే అవకాశం తక్కువ ఉంటుందని పోస్ట్ లో చెప్పడంతో దాన్ని బలంగా నమ్మాడు. వెంటనే తాను కూడా అలాగే చేశాడు. ముక్కులో నిమ్మరసం పిండుకోవడం మొదలుపెట్టాడు. అయితే అలా చేసిన తర్వాత బసవరాజ్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు బసవరాజ్ ని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతిచెందాడు. ఈ ఘటనతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది.

Advertisement

Next Story

Most Viewed