అనాదిగా వస్తున్న ఆచారం : బండి సంజయ్

by Sridhar Babu |   ( Updated:2020-08-21 09:26:47.0  )
అనాదిగా వస్తున్న ఆచారం : బండి సంజయ్
X

దిశ, కరీంనగర్: మట్టి గణపతులను పూజించడం అనాదిగా వస్తున్న ఆచారమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. పర్యావహరణ హితమైన విగ్రహాలు ప్రతిష్టించడంపై చైతన్యం పెరగాలని ఆకాంక్షించారు. శుక్రవారం కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ…

ఇటీవల కాలంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వాడకం పెరిగిందన్నారు. కానీ ఒకప్పుడు మట్టి గణపతుల్నే పూజించే విధానం ఉండేదని గుర్తుచేశారు. కరోనాను ఎదుర్కొనే మనోస్థైర్యం ఇవ్వాలని నవరాత్రుల్లో విఘ్నేశ్వరుణ్ని ప్రార్థించాలని సూచించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఉత్సవాల్ని భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు. మన వారసత్వ, సంప్రదాయ ఉత్సవాల ద్వారా క్రమశిక్షణ కలిగిన జీవన విధానాన్ని చిన్నతనం నుంచే అలవర్చుకునేందుకు వీలు కలుగుతుందన్నారు.


Advertisement
Next Story

Most Viewed