- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘అప్పటి మందం’ హోటల్.. మీకు తెలుసా?
దిశ ప్రతినిధి, కరీంనగర్: అప్పటి మందం..ఈ మాట తెలంగాణ పల్లెల్లో చాలామంది నోట వినిపిస్తుంటుంది. తాత్కాలికం అన్న పదానికి పర్యాయ పదమిది. దీర్ఘకాలంగా అప్పటి అవసరాలను తీర్చేందుకు ఏర్పాటు చేసుకునే ప్రయత్నాన్ని తెలంగాణ పల్లెల్లో ‘అప్పటిమందం’ అని అంటుంటారు. అయితే ఈ పదమే ఆయన వ్యాపారానికి అక్కరకు వచ్చింది. అప్పటి మందం పేరుతో ఓ హోటల్ ప్రారంభించాడు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెంకట్రావుపల్లికి చెందిన ఉయ్యాల లచ్చయ్య గౌడ్ ఈ పేరుతో దాదాపు పదేళ్లుగా హోటల్‌ను నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.
ఎందుకిలా?
లచ్చయ్య గౌడ్ తన కుటుంబాన్ని పోషించేందుకు వెతకని దారి లేదు. కూలీ నాలీ చేసినా, కుల వృత్తి అయిన కళ్లు గీసినా ఆర్థిక అవసరాలు మాత్రం తీరలేదు. దీంతో సౌదీ, దుబాయ్ దేశాలకు వలస కూలీగా వెళ్లొచ్చాడు. ఆ తర్వాత మళ్లీ కులవృత్తిలోకి వచ్చాడు. ఒక పని మీద కాన్సంట్రేషన్ చేయక..నిలకడగా ఒకే దానిపై ఉండకుండా జీవనం సాగిస్తున్న లచ్చయ్యను చూసి గ్రామస్తులు కామెంట్ చేయసాగారు. లచ్చయ్య నిలకడ లేని మనిషని..‘అప్పటి మందం గానివి నువ్వు’ అని అనసాగారు. అందరూ తనను అలా అప్పటిమందం అంటూ కామెంట్ చేస్తుండటంతో అదే పేరుతో వ్యాపారం చేస్తే ఎలా ఉంటుంది అని లచ్చయ్యకు అనిపించింది. దీంతో తన స్వగ్రామమైన వెంకట్రావుపల్లిలో ‘అప్పటి మందం’ పేరుతో హోటల్ స్టార్ట్ చేశారు. దాదాపు పదేళ్లుగా హోటల్ నిర్వహిస్తున్న లచ్చయ్య ఆ వ్యాపారంలో స్థిరపడ్డారు. కరోనా కారణంగా ఇంతకాలం మూసిన హోటల్‌ను ఇటీవల మళ్లీ ప్రారంభించారు. ‘అప్పటిమందం’ హోటల్ పెట్టి పదేళ్లుగా నిర్వహిస్తుండటంతో ఆ పేరే కలిసొచ్చినట్లుంది అని స్థానికులు చెబుతారు. ఏది ఏమైనా లచ్చయ్యను వ్యంగంగా అనేందుకు వాడిన పదమే అతనిని నిలబెట్టిందని స్థానికులు అంటున్నారు. అప్పటిమందం పేరిట లచ్చయ్య కొడుకు కూడా కిరాణం షాపుతో పాటు చికెన్ సెంటర్ నిర్వహిస్తుండటం కొసమెరుపు.