ఇర్ఫాన్ బ్రిలియంట్ యాక్టర్ : కరీనా

by Shyam |
ఇర్ఫాన్ బ్రిలియంట్ యాక్టర్ : కరీనా
X

దిశ, వెబ్‌డెస్క్: ఇర్ఫాన్ ఖాన్ … విభిన్న పాత్రలతో మెప్పించిన నటుడు. సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సైనికుడు’ సినిమాలో పప్పుగా యాక్ట్ చేసిన ఇర్ఫాన్ ఖాన్ తెలుగు ప్రేక్షకులను అలరించాడు. బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలతో పాటు బ్రిటిషియన్ ఫిల్మ్స్‌లోనూ నటించి తానేంటో ప్రూవ్ చేయగా…. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు ఎంతో మంది నటీనటులు ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం ఆయన నుంచి ‘ఆంగ్రేజీ మీడియం’ చిత్రం వస్తుండగా.. ఈ మధ్యే ఇర్ఫాన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు ప్రకటించారు. దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

కాగా ‘ఆంగ్రేజీ మీడియం’ సినిమాలో ఇర్ఫాన్ ఖాన్‌తో కలిసి నటించింది కరీనా కపూర్. ఇర్ఫాన్ ఖాన్ బ్రిలియంట్ యాక్టర్ అని .. అతనితో నటించేందుకు ప్రతీ ఒక్కరు ఎదురుచూస్తారని తెలిపారు. ఈ సినిమాలో కేవలం తన కోసమే నటించానని వెల్లడించారు. సినిమా విడుదల గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపిన కరీనా … తనతో కలిసి నటించడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పింది. ఆయన క్యాన్సర్ నుంచి త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని తెలిపింది. కాగా కరిష్మా కపూర్ నటిస్తున్న ‘మెంటల్ హుడ్’ వెబ్ సిరీస్ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న కరీనా ఈ వ్యాఖ్యలు చేసింది.

Tags: Irfan Khan, Angrezi medium, Kareena Kapoor, Sainikudu, Bollywood, Hollywood

Advertisement

Next Story