- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కరీనా ఫిట్‌నెస్ సీక్రెట్.. రోజుకు ఎనిమిదిసార్లు తినడమే

దిశ, సినిమా : జీరో సైజ్‌ను ట్రెండ్ చేసిన కరీనా కపూర్.. 40 ఏళ్ల వయసులోనూ అదే ఫిట్‌నెస్‌తో సక్సెస్‌ఫుల్ సినీ కెరియర్‌ను కంటిన్యూ చేస్తోంది. ఈ మధ్య రెండో బిడ్డకు జన్మనిచ్చే క్రమంలో కాస్త లావు అయినా.. మళ్లీ గతంలో ఉన్న ఫిట్‌నెస్ పొందేందుకు ఆల్రెడీ వర్కౌట్ స్టార్ట్ చేసింది. అయితే ఈ వయసులో కూడా కరీనా అంతే గ్లామర్ మెయింటైన్ చేయడం వెనుకున్న సీక్రెట్ ఏంటో తన న్యూట్రిషనిస్ట్ చెప్పేసింది. కరీనా రోజుకు ఎనిమిదిసార్లు మితంగా ఆహారం తీసుకోవడమే ఇందుకు కారణమని తెలిపింది.
ఉదయం లేవగానే కుంకుమ పువ్వుతో కలిసిన ఎండు ద్రాక్ష తీసుకునే బెబో.. ఆ తర్వాత బ్రేక్ ఫాస్ట్‌గా పరాఠా చట్నీ తీసుకుంటుందని వివరించింది. లంచ్‌కు ముందు సబ్జా గింజలు, కొబ్బరి నీళ్లు తీసుకునే తను మధ్యాహ్న భోజనంగా పెరుగన్నం, ఆవకాయ స్వీకరిస్తుందని చెప్పింది. కాస్త గ్యాప్‌లో వాల్ నట్స్, చీజ్ తీసుకుంటుందని, ఈవినింగ్ టైమ్‌లో బనానా మిల్క్ షేక్, స్నాక్స్ తింటుందని తెలిపింది. రాత్రి భోజనంలో వెజ్ పులావ్, పెరుగు.. పడుకునే ముందు పాలు తాగుతుందని చెప్పింది న్యూట్రిషనిస్ట్.