ఇలాంటి యాక్టర్ తరానికి ఒక్కడే : డైరెక్టర్

by Jakkula Samataha |   ( Updated:24 July 2021 5:44 AM  )
ranbeer-kapoor
X

దిశ, సినిమా : బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ మల్హోత్రా తన అప్‌కమింగ్ ఫిల్మ్ ‘షంషేరా’ రిజల్ట్‌పై ఎగ్జైటింగ్‌గా ఉన్నాడు. రణబీర్ కపూర్, వాణి కపూర్‌తో పాటు సంజయ్ దత్ మెయిన్ లీడ్‌గా నటిస్తున్న సినిమా ప్రేక్షకులకు సరికొత్త విజువల్ ఎఫెక్ట్‌ ఇస్తుందని అభిప్రాయపడ్డాడు. ఇందులో నటించిన యాక్టర్స్ అందరికీ ఆడియన్స్ నుంచి ఊహించనంత రెస్పాన్స్ లభిస్తుందన్న కరణ్.. రణబీర్‌ను ‘జనరేషన్ డిఫైనింగ్ యాక్టర్’గా అభివర్ణించాడు.

అంతేకాదు సంజయ్ దత్ ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే సర్‌ప్రైజ్ ఉంటుందని వెల్లడించాడు. రణబీర్‌ విషయానికొస్తే.. యాక్టింగ్‌లో ఈ తరానికే ఆదర్శంగా నిలిచాడని, ‘షంషేరా’లో కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని తెలిపాడు. శనివారం తన బర్త్‌డే సందర్భంగా మాట్లాడిన కరణ్.. ప్రేక్షకులతో కలిసి సినిమా చూసేందుకు వెయిట్ చేయలేకపోతున్నానని హింట్ ఇచ్చాడు. ప్రేక్షకులు చూడాలనుకునే కథల్లో ‘షంషేరా’ కూడా ఒకటని పేర్కొన్నాడు.



Next Story

Most Viewed