కరణ్ కొత్త పుస్తకం ‘ది బిగ్ థాట్స్ ఆఫ్ లిటిల్ లవ్’

దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహర్ మరో పుస్తకాన్ని రచించాడు. మూడేళ్ల కిందట ‘ఆన్ అన్‌సూటబుల్ బాయ్ పేరుతో తన ఆటోబయోగ్రఫీ రచించిన కరణ్.. ఇప్పుడు చిల్డ్రన్ బుక్‌తో వచ్చేస్తున్నాడు. తన కవల పిల్లలు యశ్, రూహి నుంచి స్ఫూర్తి పొంది ఈ పుస్తకం రాసినట్లు తెలిపాడు కరణ్. ‘ది బిగ్ థాట్స్ ఆఫ్ లిటిల్ లవ్’ పేరుతో వస్తున్న పుస్తకంలో కరణ్.. పేరెంట్‌గా తన అనుభవాలను పొందుపరిచారు.

యశ్, రూహి పిక్స్‌తో క్యూట్ వీడియో పోస్ట్ చేసి సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ప్రకటించిన కరణ్.. పుస్తకంలో అబ్బాయిలు, అమ్మాయిలను పెంచడంలో ఎలాంటి తేడా చూపిస్తామో వివరించామని తెలిపాడు. ఈ పిక్చర్ బుక్‌లో ట్విన్స్ ‘కుష్, లవ్’ లింగ బేధం గురించి తెలుసుకునే క్రమంలో అబ్బాయిలు, అమ్మాయిలను ఎలా ట్రీట్ చేయాలి అనే విషయం గురించి తెలుసుకుంటారని వివరించారు.

కాగా ఈ పుస్తకానికి బాలీవుడ్ కిలాడి అక్షయ్ కుమార్ వైఫ్, హీరోయిన్ ట్వింకిల్ ఖన్నా కూడా రచయితగా వ్యవహరించారు. ఇందుకు కృతజ్ఞతలు తెలిపిన కరణ్.. ‘జగ్గర్ నాథ్ బుక్స్’ ఈ పుస్తకాన్ని పబ్లిష్ చేయబోతున్నట్లు తెలిపారు.

Advertisement