ఆ కార్పొరేషన్ పై అసెంబ్లీలో ప్రస్తావిస్తా: ఎమ్మెల్యే సండ్ర

by Sridhar Babu |   ( Updated:2021-09-18 07:33:50.0  )
sandra
X

దిశ, సత్తుపల్లి : మున్నూరు కాపుల న్యాయమైన డిమాండ్ అయిన కాపు కార్పొరేషన్ ఏర్పాటు పట్ల అసెంబ్లీలో ప్రస్తావిస్తానని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. శనివారం మున్నూరు కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పలు సమస్యలతో కూడిన వినతపత్రాన్ని ఎమ్మెల్యే సండ్రకు మున్నూరు కాపు సంఘం నాయకులు అందజేశారు. అనంతరం సండ్ర మాట్లాడుతూ కార్పొరేషన్ అంశంతో పాటుగా, కమ్యూనిటీ హాలు ఏర్పాటుకు అవసరమైన స్థల కేటాయింపు విషయం సి.ఎం కే.సి.ఆర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

స్థానికంగా ఉన్న పార్టీ పదవులతో పాటు ప్రజాప్రతినిధులు గా బి.సి కోటాలో మున్నూరు కాపులకు సముచిత స్థానం కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో టి.ఆర్.ఎస్ మండల పార్టీ అధ్యక్షులు యాగంటి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story