నాలుగు ఓవర్లు వేయడానికి కూడా అలసటా?

by Shyam |
Kapil Dev
X

దిశ, స్పోర్ట్స్: యువ ఆటగాళ్ల వైఖరిపై దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మానసికంగా ధృఢంగా కనిపించే ఈ తరం క్రికెటర్లు నాలుగు ఓవర్లు వేయగానే అలసి పోవడం తనను ఆశ్చర్యపరుస్తున్నదని కపిల్ అన్నాడు. టీమ్ ఇండియాలో చాన్నాళ్లుగా సరైన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ లేకుండా పోయాడు. ఒకప్పుడు ఆల్‌రౌండర్‌గా టీమ్‌కు సేవలు చేసిన కపిల్ తర్వాత అంతటి ఆల్ రౌండర్ భారత జట్టులో లేరు. హార్దిక్ పాండ్యా రాకతో ఆ లోటు తీరిందని అందరూ భావించారు. అయితే వెన్నెముకకు శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత అతడు పూర్తి స్థాయిలో బౌలింగ్ చేయడం లేదు. కేవలం బ్యాట్స్‌మాన్ గానే జట్టులో స్థానం పొందుతున్నాడు.

ఇటీవల ఒక మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసి అలసిపోయి తిరిగి బంతిని పట్టుకోలేదు. అతడిని ఉద్దేశించే కపిల్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తున్నది. ‘మేము క్రికెట్ ఆడే సమయంలో బ్యాటు, బంతితో రాణించడమే కాకుండా అన్ని విభాగాల్లో ప్రతిభ చూపితే కాని జట్టులో చోటు దక్కేది కాదు. కానీ ప్రస్తుతం ఏదో విధంగా రాణిస్తే సులభంగానే జట్టులోకి వచ్చేస్తున్నారు. క్రికెట్ సులభంగా మారినా.. బౌలర్లు మాత్రం నాలుగు ఓవర్లు వేసి అలసిపోయాం అంటున్నారు. అలాంటి వారికే నాలుగే ఓవర్లు బంతి ఇస్తున్నట్లు కూడా నాకు తెలిసింది. మా కాలంలో ఆఖరి ఆటగాడికి కూడా నెట్స్‌లో 10 ఓవర్లు వేసే వాళ్లం. అలాంటి వైఖరిని నేటి తరం అందిపుచ్చుకోవాలి’ అంటూ పరోక్షంగా హార్దిక్‌పై విమర్శలు చేశాడు.

Advertisement

Next Story

Most Viewed