Kapil Dev, Rishabh Pant : రిషబ్ పంత్‌కు కపిల్ సలహాలు

by Shyam |   ( Updated:2021-05-27 10:28:39.0  )
Kapil Dev, Rishabh Pant : రిషబ్ పంత్‌కు కపిల్ సలహాలు
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మాన్ రిషబ్ పంత్‌కు దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ విలువైన సూచనలు ఇచ్చారు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లతో జరిగిన సిరీస్‌లలో విశేషంగా రాణించిన పంత్.. టీమ్ ఇండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. త్వరలో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనున్న జట్టులో పంత్ కూడా సభ్యుడిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో కపిల్ దేవ్ కీలక సలహాలు ఇచ్చారు. ‘రిషబ్ పంత్ ఇప్పడు క్రికెటర్‌గా మంచి పరిణితి సాధించాడు. అతడి దగ్గర అన్ని రకాల షాట్లు ఆడగలిగే సత్తా ఉన్నది. అతడు బ్యాటింగ్ చేస్తుంటే చూడముచ్చటగా ఉంటుంది.

అయితే పంత్ తన దూకుడును కాస్త తగ్గించుకుంటే మంచింది. క్రీజ్‌లోకి రావడంతోనే ప్రతీ బంతిని బాదేయాలని చూస్తుంటాడు. అలా చేయడం సబబు కాదు. సాధ్యమైనంత ఎక్కువ సేపు క్రీజ్‌లో ఉండటానికి పంత్ ప్రయత్నించాలి. అతడు కొంత సహనంతో వ్యవహరిస్తే భారీ స్కోర్ చేసే అవకాశం వస్తుంది. ఇంగ్లాండ్ పిచ్‌లు చాలా వైవిధ్యంగా ఉంటాయి. రావడంతోనే హిట్టింగ్ చేస్తే వికెట్ పోగొట్టుకొనే అవకాశం ఉంటుంది. అందుకే ముందు క్రీజులో కుదురు కోవడానికి ప్రయత్నించాలి. ఆ తర్వాత నెమ్మదిగా హిట్టింగ్ ప్రారంభించాలి. గతంలో రోహిత్ శర్మ కూడా ఇలాగే దూకుడుగా ఉండేవాడు. అతనికి కూడా ఇలాగే సలహా ఇచ్చాను. దీంతో అతడు తన బలహీనతను అధిగమించి మంచి బ్యాట్స్‌మాన్‌గా రాణిస్తున్నాడు’ అని కపిల్ దేవ్ ఒక జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.

Advertisement

Next Story