- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
క్రికెట్.. ప్రాణం కన్నా విలువైంది కాదు : కపిల్

కరోనాపై పోరాటానికి నిధులు సమకూర్చుకునేందుకు ఇండియా-పాక్ జట్ల మధ్య 3 వన్డేల ద్వైపాక్షిక సిరీస్ నిర్వహించాలన్న అక్తర్ ప్రతిపాదనను భారత లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ తోసిపుచ్చాడు. భారత్‌కు నిధులు అవసరం లేదని, అయినా క్రికెట్ మ్యాచ్ కోసం ప్రాణాలను రిస్క్‌లో పెట్టాల్సిన అవసరం లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రస్తుత పరిస్థితుల్లో కావలసింది.. మన ప్రాణాలను కాపాడుకోవడంతో పాటు పేదలకు సాయం చేయడమేనని తెలిపాడు.
ఇప్పటికే కరోనాపై పోరాటానికి బీసీసీఐ రూ. 51 కోట్ల భారీ మొత్తాన్ని విరాళంగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశాడు. పైగా ఇంకా అవసరమైతే ఇచ్చేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉందని తెలిపాడు. ‘దేశం కన్నా క్రికెట్ ఎక్కువ కాదని’.. ఇంకో నాలుగైదు నెలల వరకు క్రికెట్ గురించిన ఆలోచన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. కరోనాపై యుద్ధంలో ముందుండి పోరాడుతున్న డాక్టర్లు, పోలీసులు, ఇతర సిబ్బందితో పాటు పేదలను కాపాడుకోవడమే ప్రస్తుత కర్తవ్యమని కపిల్ వెల్లడించాడు. కాగా, బుధవారం అక్తర్ పీటీఐతో మాట్లాడుతూ.. నిధుల సమీకరణ కోసం ఇండో పాక్ సిరీస్ ప్రతిపాదన చేసిన విషయమ తెలిసిందే.
Tags: Shoaib Akhtar, Kapil Dev, Odi series, BCCI, Life risk