‘కన్నానులే’ కవర్ సాంగ్.. లావణ్య సూపర్ గ్రేస్

దిశ, వెబ్‌డెస్క్ : బొంబాయి సినిమాలో.. అరవింద స్వామి, మనీషా కోయిరాలాపై చిత్రీకరించిన ‘కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే..’ సాంగ్‌ను ఎప్పుడూ తలుచుకున్నా కళ్ల ముందే మెదులుతుంది. మనీషా కోయిరాలా అందం.. ఆ అందాన్ని చూసేందుకు వచ్చిన అరవింద స్వామి.. సాంగ్ విజువలైజేషన్ అదుర్స్ కదా! ఇప్పటికీ చాలా మంది ప్లే లిస్ట్‌లో ఉండే ఈ సాంగ్‌పై కవర్ సాంగ్ చేసి సూపర్ అనిపించింది హీరోయిన్ లావణ్య త్రిపాఠి.

‘నేనెప్పుడూ ఒక్కటే నమ్ముతాను.. హార్ట్‌ను ఫాలో అయిపోవాలని, ఇప్పుడూ అదే చేశాను.. నా హృదయానికి దగ్గరైన ఈ బ్యూటిఫుల్ సాంగ్‌పై పర్‌‌ఫార్మ్ చేశాను’ అని చెప్పింది లావణ్య.

ఉమయ్ గుప్తా, లావణ్య త్రిపాఠి పర్‌ఫార్మ్ చేసిన సాంగ్‌కు ఉమయ్ కొరియోగ్రఫీ చేసింది. ఔరా ఫొటోగ్రఫీ ఫిల్మ్స్ సమర్పించిన సాంగ్‌కు.. డీఓపీగా నితిన్ వర్క్ చేశారు. కాగా లావణ్య డ్యాన్స్, గ్రేస్‌కు భారీ కాంప్లిమెంట్స్ అందుతున్నాయి. తనను జూనియర్ మనీషా కోయిరాలాగా అభివర్ణిస్తున్న నెటిజన్లు.. ఇంత బ్యూటిఫుల్ డ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేయలేదని అంటున్నారు.

Advertisement