- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘పునీత్ రాజ్‌కుమార్’ సినిమాల్లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ హీరోనే.. ఎందుకో తెలుసా..!
దిశ, వెబ్‌డెస్క్ : శాండల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ (46) శుక్రవారం ఉదయం గుండెపోటు మరణించాడని తెలియగానే కన్నడ చిత్ర పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. అభిమానులను కంట్రోల్ చేసేందుకు కర్ణాటకలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు రేపు సాయంత్రం వరకు జరుగుతాయని తెలుస్తోంది. అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని కన్నడ చిత్ర పరిశ్రమ కార్యాలయంలో ఉంచనున్నట్టు సమాచారం. ఇప్పటికే సీఎం బసవరాజ బొమ్మై పునీత్ కుటుంబసభ్యులను కలిసి పరామర్శించారు. దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు, సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు పునీత్ మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే పునీత్ రాజ్ కుమార్ చదువుకునే రోజుల్లోనే చైల్డ్ ఆర్టిస్టుగా వెండి తెరకు పరిచయం అయ్యారు. బాలనటుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు. ఆ వయస్సులో చేసిన సినిమాల్లో ఉత్తమ నటనకు గాను జాతీయ అవార్డును సైతం సొంతం చేసుకున్న వ్యక్తిగా కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో నిలిచాడు పునీత్.. అయితే, సినిమాల పరంగానే కాదు. ఓ మంచి వ్యక్తిగా పునీత్ చాలా మంచి కార్యక్రమాలు చేశారు.
తల్లిదండ్రులు లేని 26 మంది అనాధలను పునీత్ దత్తత తీసుకున్నారు. అలాగే 15 పాఠశాలలు, 16 వృద్ధాశ్రమాలు, 19 గోశాలకు కేర్ టేకర్‌గా ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే పునీత్ రాజ్‌కుమార్ 1800 మంది విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పిస్తున్నారు. అంతేకాకండా నిరుపేదలైన ఆడపిల్లలకు మంచి చదువు చెప్పిస్తున్నారని తెలిసింది. చివరకు తాను చనిపోయాక తన కళ్లు ఇతరులకు ఉపయోగపడాలని డోనెట్ చేసినట్టు టాక్. అందుకే పునీత్ రాజ్ కుమార్ వ్యక్తి కాదని గ్రేట్ హ్యుమన్ బీయింగ్ అని నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ చేస్తున్నారు.