- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిఖిల్ కుమార్ ‘రైడర్’ Teaser Out
దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి తనయుడు, కన్నడ హీరో యువరాజా నిఖిల్ కుమార్ గౌడ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘రైడర్’. ఈ మూవీకి ‘గుండెజారి గల్లంతయ్యిందే’ ‘ఒక లైలా కోసం’ ‘ఒరేయ్ బుజ్జిగా’ వంటి లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ తీసిన విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో ఏక కాలంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని లహరి ఫిలిమ్స్ బ్యానర్‌పై చంద్రు మనోహరన్ నిర్మిస్తున్నారు. శుక్రవారం హీరో నిఖిల్ బర్త్ డే సందర్భంగా ‘రైడర్’ టీజర్‌ని మూవీ యూనిట్ రిలీజ్ చేసింది.
నిఖిల్ కుమార్ ఒక ఫెరోషియస్ యాక్షన్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తుంది. కేవలం ఫైటింగ్ సన్నివేశాలతో ఈ టీజర్‌ని చూపించడం ద్వారా ఇదొక కంప్లీట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అని గ్రహించొచ్చు. నిఖిల్ సరసన కశ్మీరా పరదేశీ హీరోయిన్‌గా నటిస్తోంది. అర్జున్ జన్యా సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి శ్రీష కుడువల్లి సినిమాటోగ్రాఫర్.