ఫైనల్ గా.. సింగర్ కనిక కు కరోనా నెగెటివ్

by Shyam |
ఫైనల్ గా.. సింగర్ కనిక కు కరోనా నెగెటివ్
X

దిశ వెబ్ డెస్క్: బాలీవుడ్ గాయని కనికా కపూర్.. ఎట్టకేలకు కరోనా నుంచి బయటపడ్డారు. ఐదోసారి చేసిన కోవిడ్-19 టెస్టులో ఆమెకు నెగిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆమె ఉత్తర ప్రదేశ్ రాజధాని లఖ్‌నవూలో ఉన్న సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యూయేట్ ఇనిస్టిట్యూల్ ఆఫ్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారు. ఆమె అక్కడే స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఆమెకు నెగెటివ్ వచ్చినప్పటికీ మరికొంత కాలం ఆమె ఆసుపత్రిలో ఉండనున్నారని సమాచారం.

ప్రముఖ బాలీవుడ్ గాయనీ క‌నికా కపూర్ కి కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే.. లండన్‌ నుంచి మార్చి 9న ఉత్తర ప్రదేశ్‌ వచ్చిన కనికా కపూర్‌ హోటల్‌లో బస చేసింది. ఆ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులను ఆమె కలవడమే కాకుండా పార్టీ కూడా చేసుకున్నారు. ఆమెకు కరోనా సోకినట్లు తేలడంతో సంచలనం రేగింది. ఆ తర్వాత ఆమెను క్వారంటైన్‌లోకి పంపించారు. ప్రభుత్వం నిబంధ‌నలు పాటించ‌కుండా పార్టీల‌కు వెళ్ళడం వలన ఆమెపై పోలీసులు కేసు కూడా న‌మోదు చేశారు. ప్రస్తుతం ఆమె ఉత్తర ప్రదేశ్ రాజధాని లఖ్‌నవూలో ఉన్న సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యూయేట్ ఇనిస్టిట్యూల్ ఆఫ్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారు. చికిత్స లో భాగంగా ఆమెకి నాలుగు సార్లు టెస్టు చేయగా అన్ని సార్లు పాజిటివ్ అనే తేలింది. తాజాగా ఆమెకు డాక్టర్లు ఐదోసారి కోవిడ్ 19 టెస్ట్ చేశారు. ఈ సారి ఆమెకు నెగిటీవ్ వచ్చింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వివరించారు. ప్రస్తుతానికి కనికకు కరోనా నెగిటివ్ వచ్చినప్పటికీ ఆమె ఆసుపత్రిలోనే ఉండాలి. ఆ తర్వాత 8 రోజులపాటు వైద్యులు టెస్ట్‌లు చేస్తారు. ఆ టెస్టుల్లో కూడా నెగిటివ్ వస్తే కనికా పూర్తిగా కోవిడ్ 19 నుంచి బయటపడినట్లేనిని వైద్యులు చెబుతున్నారు.

Tags: singer kanika kapoor, coronavirus, covid-19 test , positive, negative

Advertisement

Next Story