గ్యాంగిజం, గ్రూపిజంతో బిజినెస్ దెబ్బతింటోంది : కంగన

by Shyam |   ( Updated:2023-04-01 15:04:55.0  )
గ్యాంగిజం, గ్రూపిజంతో బిజినెస్ దెబ్బతింటోంది : కంగన
X

దిశ, సినిమా : ఫైర్ బ్రాండ్ యాక్ట్రెస్ కంగనా రనౌత్ నటించిన ‘తలైవి’ మూవీ ఈ నెల 10న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పలు విషయాలు పంచుకున్న కంగనా.. పాండమిక్ వల్ల నష్టపోయిన రంగాల్లో మూవీ బిజినెస్ కూడా ఒకటని, ఈ టైమ్‌లో సినిమా రిలీజ్ చేసేందుకు థియేటర్ ఓనర్స్, మల్టిప్లెక్స్ చైన్స్ నుంచి తన నిర్మాతలకు మద్దతు లభించలేదని వెల్లడించింది. ఓ వీడియో మెసేజ్ షేర్ చేసిన స్టార్ హీరోయిన్.. పాండమిక్ టైమ్‌లో థియేటర్ బిజినెస్ పడిపోవడంతో అనేక స్ట్రీమింగ్, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ప్రాఫిట్ పొందాయని తెలిపింది.)

ఇక తలైవి విషయానికొస్తే.. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ నుంచి అనేక ఆఫర్లు వచ్చినప్పటికీ సినిమాను థియేటర్స్‌లో రిలీజ్ చేసే ఉద్దేశంతో నిర్మాతలు రిజెక్ట్ చేశారని చెప్పింది. కాగా రూ.90 కోట్ల వ్యయంతో నిర్మించబడిన ‘తలైవి’ ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో రూపొందిన భారీ బడ్జెట్‌ ఫిమేల్ సెంట్రిక్ సినిమాల్లో ఒకటని తెలిపింది. అయితే సినిమా రిలీజ్‌కు సంబంధించి కొన్ని స్టూడియో సంస్థలు సహకరించడం లేదని వాపోయింది.

కొన్ని థియేటర్స్, మల్టిప్లెక్స్ చైన్స్ తమ సినిమా ప్రదర్శనకు అనుమతించడం లేదని చెప్పింది. యశ్‌రాజ్ వంటి స్టూడియోలు అందుకు అడ్డు పడుతున్నాయని తెలుస్తుండగా.. థియేటర్లు, మల్టిప్లెక్స్‌లు ‘గ్యాంగిజం, గ్రూపిజం’ను వదిలి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంపై దృష్టిపెడితే బాగుంటుందని సూచించింది. ప్రస్తుతం ‘తలైవి’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న కంగన.. శనివారం ఉదయం దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు మెరీనా బీచ్ వద్ద నివాళులు అర్పించింది.

Advertisement

Next Story

Most Viewed