భల్లాల దేవునితో.. మణికర్ణిక ?

by  |
భల్లాల దేవునితో.. మణికర్ణిక ?
X

తన నటనతోనే కాదు.. వివాదాస్పద వ్యాఖ్యలతోనూ ఎప్పుడూ వార్తల్లో నిలిచే నటి కంగనా రనౌత్. సుశాంత్‌ ఆత్మహత్య విషయంలో ఇప్పటికే పలువురు బాలీవుడ్‌ ప్రముఖులపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇక తన కెరీర్ విషయానికొస్తే.. మణికర్ణిక సినిమా తర్వాత ‘జడ్జిమెంటల్ హై క్యా, పంగా, తలైవి’ సినిమాలు చేసింది కంగనా. ఆ తర్వాత తాను చేయబోయే ప్రాజెక్టు గురించి ఇంతవరకు అనౌన్స్ చేయలేదు. అయితే, తాజాగా కంగనా తన బ్యూటిఫుల్ పిక్‌తో పాటు తన అభిమానులకు ఓ గుడ్‌న్యూస్ కూడా చెప్పింది.

బాలీవుడ్‌లో అతి ఎక్కువ పారితోషికం తీసుకునే నటుల్లో కంగనా రనౌత్ ఒకరు. కథా ప్రాధాన్యమున్న చిత్రాలను చేసే కంగనా.. త్వరలోనే టాలీవుడ్ హంక్ రానా దగ్గుబాటితో జతకట్టే అవకాశాలున్నాయి. రాబోవు ప్రాజెక్ట్ కోసం రానా ద‌గ్గుబాటితో వ‌ర్చువ‌ల్ సంభాష‌ణ చేయబోతున్నాననే విషయాన్నికంగ‌నా లేటెస్ట్‌గా తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది. దీంతో అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్‌లోనూ ఆసక్తికర చర్చ మొదలైంది. అయితే ఈ ప్రాజెక్టు గురించి ఇతర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. బాహుబలి సినిమాలో భల్లాల దేవుడిగా ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు రానా. అంతేకాదు.. ‘బేబీ, డిపార్ట్‌మెంట్, దమ్ మారో దమ్’ తదితర చిత్రాలతో నార్త్‌లోనూ సత్తా చాటాడు. అయితే రానా విషయానికొస్తే.. తన ప్రేయసి మిహికాతో ఆగస్టులో పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. మరి పెళ్లి తర్వాత రానా చేయబోయే ప్రాజెక్ట్ కంగనాతోనేనా? లేదా అన్నది ఈ మీటింగ్ తర్వాతే తెలియనుంది. కంగనా ఇప్పటికే తెలుగులో ప్రభాస్‌తో ‘ఏక్ నిరంజన్’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.


Next Story

Most Viewed