- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్రాకర్స్ ఎందుకు కాల్చొద్దు.. ఆఫీసులకు నడుచుకుంటూ వెళ్లండి : కంగనా
దిశ, సినిమా: దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా కాల్చడాన్ని నిషేదించాలంటున్న చాలా మంది కోరుతున్నారు. వారిపై కాంట్రవర్సీ క్వీన్ కంగనా షాకింగ్ కామెంట్స్ చేసింది. ఎవరైతే పటాకుల కాలుష్యం గురించి మాట్లాడుతున్నారో వాళ్లందరూ మూడు రోజులపాటు తమ పని ప్రదేశాలు, ఆఫీసులకు కార్లు, బస్సుల్లో కాకుండా నడుచుకుంటూ వెళ్లాలని సూచించింది.
వెలుగుల పండుగగా భావించే దీపావళి రోజున పటాకుల వేడుకలు లేకుంటే అసంపూర్ణంగా కనిపిస్తుందన్న కంగనా.. దీపావళి పండుగ ప్రత్యేకతను గురించి సద్గురు మాట్లాడిన కొన్ని విషయాలను తన ఇన్‌స్టా్గ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. మరో వైపు బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ కూతురు రియా కపూర్.. ‘క్రాకర్స్ పేల్చడం అనేది చాలా అజ్ఞానం, అజాగ్రత్త, బాధ్యతారాహిత్యం. పటాకులు పేల్చడం ఆపండి’ అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసింది. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా బాణసంచాపై నిషేధాన్ని ప్రకటిస్తూ, ప్రజల ప్రాణాలను రక్షించడం చాలా అవసరమని పేర్కొన్నారు.