నేను ఇంట్లో ఉరేసుకుంటే.. ఆత్మహత్య చేసుకున్నట్లు కాదు : కంగనా

by  |
నేను ఇంట్లో ఉరేసుకుంటే.. ఆత్మహత్య చేసుకున్నట్లు కాదు : కంగనా
X

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ బాలీవుడ్‌లో ఎవరినైనా ఎదురించేందుకు వెనకాడదు. బంధుప్రీతి విషయానికొస్తే బాలీవుడ్‌ను ఏలుతున్న కరణ్ జోహార్, మహేష్ భట్ లాంటి వాళ్లకు మీడియాముఖంగా భారీ పంచ్‌లు ఇస్తూనే ఉంటుంది. సుశాంత్ సింగ్ మరణం తర్వాత మరింత డోస్ పెంచిన కంగనా.. ఈ కేసు విషయంలో ఈ సారి ఏకంగా ముఖ్యమంత్రి కొడుకునే టార్గెట్ చేసింది. సుశాంత్ మరణానికి ముందు రోజు తన ఇంట్లో పార్టీ జరిగిందని.. ప్రముఖ వ్యక్తులు హాజరయ్యారని మీడియా ప్రసారం చేసింది కానీ.. అసలు ఆ వ్యక్తి ఎవరో చెప్పలేదు.

https://twitter.com/KanganaTeam/status/1289093123256115201?s=19

దీంతో కంగనా ఆ వ్యక్తి ఎవరో హింట్ ఇచ్చేసింది. ‘ఆయన అందరికీ తెలుసు కానీ, ఎవరూ తన పేరు బయటపెట్టే సాహసం చేయలేకపోయారు. కానీ అతని పేరు నేను చెప్తా’ అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించేసింది. ఆ వ్యక్తి ఎవరో కాదు కరణ్ జోహార్ మిత్రుడు, ప్రపంచంలోనే ఉత్తమమైన సీఎం కొడుకు.. తన ముద్దు పేరు ‘బేబీ పెంగ్విన్’ అంటూ పరోక్షంగా ఎవరో చెప్పేసింది కంగనా. ఒకవేళ నా ఇంట్లో ఉరేసుకుని ఉంటే.. నేను ఆత్మహత్య చేసుకోలేదని గమనించాలని కోరింది కంగనా. అంటే ఎవరైనా హత్య చేసి ఉంటారని అర్థం చేసుకోవాలని అంటోంది కంగనా. సుశాంత్ కేసులో ఇలాగే జరిగిందని.. అసలు హంతకులు ఎవరో గుర్తించాలని పరోక్షంగా సూచిస్తోంది.


Next Story

Most Viewed