రణ్‌వీర్, రణబీర్ డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలి : కంగనా

దిశ, వెబ్‌డెస్క్ : కంగనా రనౌత్ బాలీవుడ్ ఇండస్ట్రీని ఆడుకుంటోంది. ముఖ్యంగా సుశాంత్ కేసులో డ్రగ్ యాంగిల్ బయటకు వచ్చినప్పటి నుంచి మరింత స్పీడ్ పెంచింది. బాలీవుడ్‌లో కొకైన్ ఎక్కువగా వినియోగిస్తారని, చాన్స్ ఇస్తే 100% నిరూపిస్తానన్న కంగనా.. ఇందుకోసం సెంట్రల్ గవర్నమెంట్ తనకు రక్షణ కల్పించాలని కోరింది.

కాగా, ఇండస్ట్రీలో కొత్తగా మరో రూల్ తీసుకురావాలని కోరుతోంది కంగనా అండ్ టీమ్. సమాజానికి రోల్ మోడల్స్‌గా ఉన్నవారు నేషనల్ అవార్డు అందుకోవాలంటే ముందుగా డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలని డిమాండ్ చేసింది. డ్రగ్స్‌కు అడిక్ట్ అయినవాళ్ళకు మనకు రోల్ మోడల్స్‌గా ఉండే అర్హత ఎలా ఉంటుందని ప్రశ్నిస్తోంది. ఇంకొంచెం ముందుకెళ్లి రణ్‌వీర్ సింగ్, రణబీర్ కపూర్, అయాన్ ముఖర్జీ, విక్కీ కౌశల్ లాంటి యంగ్ స్టార్స్ డ్రగ్ టెస్ట్ కోసం వారి బ్లడ్ శాంపిల్స్ ఇవ్వాలని కోరింది. వారు కొకైన్‌కు అడిక్ట్ అయినట్లు రూమర్స్ వస్తున్నాయని.. అలాంటి రూమర్స్‌కు చెక్ పెట్టేందుకు టెస్ట్ చేయించుకోవాలంది కంగనా. ఒకవేళ శాంపిల్స్ ఇస్తే ఈ యంగ్ స్టార్స్ లక్షల మంది యువతకు స్ఫూర్తినిచ్చిన వారవుతారని తెలిపింది.

కాగా, కంగనా ప్రతిపాదనకు చాలామంది సుముఖత వ్యక్తం చేస్తున్నారు. డోపింగ్ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలితే ‘వాడా’ క్రీడా పోటీలకు ఆటగాళ్లను నిషేధించినట్లే.. ఫిల్మ్ సెన్సార్ బోర్డు కూడా కొత్త విధానాన్ని అమలు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. నటులకు డ్రగ్ టెస్ట్ చేసిన తర్వాతే సినిమా విడుదల సర్టిఫికెట్ ఇవ్వాలనే ప్రతిపాదనలు కూడా తెస్తున్నారు.

Advertisement