- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇది కూడా జిహాదీ దేశమే .. మోడీ ప్రభుత్వంపై కంగనా సంచలన వ్యాఖ్యలు
దిశ, సినిమా: వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నటి కంగనా రనౌత్ నిరాశ చెందినట్లు తెలిపింది. ఈ మేరకు మోడీ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో తన అభిప్రాయాలను వెల్లడించిన కంగనా.. వ్యవసాయ చట్టాల రద్దు గురించి ఒక వ్యక్తి చేసిన ట్వీట్‌ను పంచుకుంటూ ఇలా రాసుకొచ్చింది.. ‘ఇది విచారకరం, అవమానకరం, పూర్తిగా అన్యాయం. పార్లమెంటులో ఎన్నుకున్న ప్రభుత్వం కాకుండా వీధుల్లో ప్రజలు చట్టాలు చేయడం ప్రారంభించినట్లయితే.. ఇది కూడా జిహాదీ దేశమే. ఇదే కోరుకున్న వారికి అభినందనలు’ అంటూ కాంట్రవర్సీ కామెంట్స్ చేసింది.
అలాగే శుక్రవారం మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 104వ జయంతిని ట్యాగ్ చేస్తూ.. ‘దేశం గాఢ నిద్రలో ఉన్నప్పుడు చూసి ఏకపక్ష నిర్ణయం చేయడం నియంతృత్వమే.. పుట్టినరోజు శుభాకాంక్షలు మేడమ్’ అంటూ ఇందిరా గాంధీ ఫొటో షేర్ చేయడం విశేషం. ఇక బీజేపీ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్షాలు, రైతులు, ఆందోళనకారులు స్వాగతించగా.. కంగన మాత్రం ఇలా మాట్లాడటంపై మండిపడుతున్నారు నెటిజన్లు.
- Tags
- kangana ranaut