కంగనా రనౌత్ నివాసం ఎదుట కాల్పుల కలకలం

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హీరోయిన్‌ ఇంటి వద్ద కాల్పులు మోత కలకలం సృష్టించింది. సొంతింటిలో సేద తీరుతున్న ఆమెను భయపెట్టేందుకు కొంతమంది దుండగులు కాల్పుల జరిపినట్టు తెలుస్తోంది. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ వ్యవహారంలో బాలీవుడ్‌పై హాట్ కామెంట్స్ చేసిన కంగనా రనౌత్ ఇంటిపై ఈ కాల్పులు జరగడం గమనార్హం.

హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలిలో ఈ బాలీవుడ్ బ్యూటీకి ఓ సొంత నివాసం ఉంది. కాగా, ప్రస్తుతం కంగనా అక్కడే ఉంటోంది. అయితే, శనివారం ఒక్కసారిగా కాల్పుల శబ్ధం ఆ ఇంటి వద్ద వినిపించింది. కాల్పుల మోతకు హడలిపోయిన స్థానిక ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన హీరోయిన్ ఇంటికి చేరకున్న పోలీసులు ఆమెకు భద్రతను ఏర్పాటు చేశారు. పోలీసుల ఆ ఇంటి ఆవరణలో బందోబస్తు అయ్యారు.

ఈ వ్యవహారంపై కంగనా స్పందింస్తూ.. కావాలనే తనను బెదిరించడానికి కాల్పులు జరిపినట్టు స్పష్టం చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసుల విచారణ ముమ్మరం చేశారు. కంగనా రనౌత్‌ను కాల్పులతో బెదిరించే అవసరం ఎవరికి ఉందన్న కోణంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలెట్టారు.

Advertisement