ఆ హీరోయిన్ నాకు దేవుడిచ్చిన తల్లి : కంగన

by Shyam |
ఆ హీరోయిన్ నాకు దేవుడిచ్చిన తల్లి : కంగన
X

దిశ, సినిమా : బాలీవుడ్ ఎవర్‌గ్రీన్ స్టార్ రేఖ నేడు 67వ పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు ఫ్రెండ్స్ సోషల్ మీడియా వేదికగా ఐకానిక్ యాక్ట్రెస్‌కు శుభాకాంక్షలు చెబుతుండగా.. ఫైర్ బ్రాండ్ నటి కంగనా రనౌత్ సైతం తనదైన స్టైల్‌లో రేఖకు బర్త్‌డే విషెస్ తెలిపింది. ఇన్‌స్ట్రాగ్రామ్‌లో బ్యూటిఫుల్ రేఖతో ఉన్న త్రో బ్యాక్ పిక్చర్ చేస్తూ ‘దయ, ఉదాత్తత, అందానికి ప్రతిరూపమైన నా గాడ్ మదర్ రేఖ జీ.. హ్యాపీ బర్త్‌డే’ అంటూ విష్ చేసింది. ఇక రేఖ, కంగన మధ్యన మంచి ఫ్రెండ్‌షిప్ ఉందన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో ప్రస్తావించిన రేఖ.. తనకు ఒక కుమార్తె ఉంటే, ఆమె బహుశా కంగనలా ఉండేదని పేర్కొంది. అంతేకాదు ‘మణికర్ణిక : ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’గా తెరపై కనిపించిన కంగనను.. నిజ జీవితంలోనూ ఝాన్సీ రాణి’ అనే పిలిచేది. కాగా పబ్లిక్ ఫంక్షన్స్‌కు హాజరైనపుడు వీరిద్దరి ఆప్యాయత సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తుంటుంది.

Advertisement

Next Story

Most Viewed