- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రక్షణ మంత్రి చేతిలో ‘తేజస్’ స్క్రిప్ట్
దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌ను పలు వివాదాలు చుట్టుముడుతున్నా, తన పని తాను చేసుకుంటూ షూటింగ్స్‌లో పాల్గొంటోంది. ఈ మధ్యే ‘తలైవి’ మూవీ షూటింగ్ కంప్లీట్ కావడంతో కాస్త ఎమోషనల్ అయిన కంగన.. ‘నేను ఈ పాత్రతో ప్రేమలో పడిపోయాను. ఇప్పుడు ఈ సినిమాకు ముగింపు పలకడం చాలా బాధగా, కష్టతరంగా ఉంది. మిక్స్‌డ్ ఫీలింగ్స్ నా హృదయాన్ని నింపేశాయి’ అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఆ మూవీ జ్ఞాపకాల్లోంచి బయటకొచ్చిన కంగన.. తన తదుపరి ప్రాజెక్ట్ ‘తేజస్’ పనుల్లో బిజీగా మారింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందుతున్న ‘తేజస్’లో కంగనా రనౌత్ పైలెట్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం కంగన.. ఆమె సోదరి రంగోలి, చిత్ర బృందంతో కలిసి ఆదివారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసింది. ఈ సందర్భంగా సినిమా స్ర్కిప్ట్‌ను రక్షణ మంత్రితో పాటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మీడియా కోఆర్డినేషన్ సెంటర్ అధికారులకు అందజేశారు. దాంతోపాటు ఆయన ఆశీర్వాదాలు, సినిమాకు కావాల్సిన అనుమతులను కోరినట్టు కంగన తెలిపారు.
https://twitter.com/KanganaTeam/status/1338097400544710657
తేజస్‌లో పైలట్‌గా చేస్తున్న కంగన.. ఆ పాత్రకు న్యాయం చేసేందుకు తన స్వస్థలమైన హిమాచల్ ప్రదేశ్‌లో పైలట్ వర్క్‌షాప్‌లకు హాజరైంది. ఈ సినిమాను రోనీ స్క్రూవాలా నిర్మిస్తుండగా, సర్వేష్ మేవారా దర్శకత్వం వహిస్తున్నారు. కంగన ఈ చిత్రం తర్వాత ‘ధాకడ్’లో నటించనుంది.