విక్రమ్‌గా రాబోతున్న కమల్

by Shyam |
విక్రమ్‌గా రాబోతున్న కమల్
X

దిశ, వెబ్‌డెస్క్: వెర్సటైల్ యాక్టర్ కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా.. ఆయన ఫ్యాన్స్‌కు అద్భుతమైన సర్‌ప్రైజ్ వచ్చేసింది. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న తాజా చిత్రానికి సంబంధించిన టైటిల్ అనౌన్స్ చేయడంతో పాటు టీజర్ కూడా రిలీజ్ చేసింది చిత్ర బృందం. కాగా ఈ సినిమాకు ‘విక్రమ్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు.

‘విక్రమ్’ సినిమాలో కమల్ క్యారెక్టర్ చూస్తుంటే చాలా విభిన్నంగా ఉంది. అతిథుల కోసం ఆయనే స్వయంగా ఆహారం వండటం, వడ్డించడం.. ఆ తర్వాతే తాను దాడి చేయడానికి అవసరమైన తుపాకులను సిద్ధం చేసుకోవడాన్ని ట్రైలర్‌లో చూపించిన దర్శకుడు సినిమాపై ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశాడు. అంతేకాదు.. గతంలో ‘ఒకానొక సమయంలో అక్కడ ఓ దెయ్యం నివసించింది’ అని పేర్కొనడం కూడా చాలా ఆసక్తికరంగా ఉంది.

కమల్ హాసన్‌‌కు చెందిన రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, యువ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ సినిమాతో పాటు ‘భారతీయుడు 2’ మూవీ కూడా చేస్తున్నారు కమల్ హాసన్.

Advertisement

Next Story