సల్మాన్‌‌ను గూండా అంటూ కేఆర్‌కే వార్నింగ్

by Shyam |
సల్మాన్‌‌ను గూండా అంటూ కేఆర్‌కే వార్నింగ్
X

దిశ, సినిమా : యాక్టర్, ప్రొడ్యూసర్, రైటర్ కమాల్ ఆర్ ఖాన్(KRK).. సల్మాన్ ఖాన్‌కు ఇండైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చాడు. దమ్ముంటే డైరెక్టర్‌గా పోరాడు.. సింగర్స్‌, యాక్టర్స్‌ వెనుక దాక్కుని నాటకాలు ఆడొద్దని హెచ్చరించాడు. సల్మాన్‌ను బాలీవుడ్ గూండాగా అభివర్ణిస్తూ ట్వీట్ చేసిన కేఆర్‌కే.. స్ట్రగ్లింగ్ యాక్ట్రెస్, చీప్ సింగర్స్‌ ద్వారా వార్నింగ్‌లు ఇవ్వకుండా ప్రత్యక్షంగా యుద్ధం చేయాలన్నాడు. సల్మాన్ కెరియర్‌ను నాశనం చేస్తానని హెచ్చరించిన ఆయన టీవీ యాక్టర్‌గా మారే రోజులు దగ్గరే ఉన్నాయన్నాడు. ‘నీ అంతానికి సమయం వచ్చింది’ అంటూ ట్వీట్ చేశాడు.

దీంతో ఈ పోస్ట్ వైరల్ కాగా సల్మాన్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. కాగా ఈద్ కానుకగా సల్మాన్ ఖాన్ ‘రాధే: ది మోస్ట్ వాంటెడ్ భాయ్’ మూవీ రిలీజ్ అయింది. ఈ చిత్రానికి కాస్త నెగెటివ్ రివ్యూ ఇవ్వడంతో పరువు నష్టం దావా కేసు వేశాడు సల్మాన్. మనీలాండరింగ్ ఆరోపణలకు రెస్పాండ్ అవుతూ ఈ కేసు వేశామని సల్లూ భాయ్ తరపు న్యాయవాదులు చెప్తున్నా.. ‘రాధే’ మూవీకి నెగెటివ్ రివ్యూ ఇచ్చినందుకే సల్మాన్ ఇదంతా చేస్తున్నాడని చెప్తున్నాడు కేఆర్‌కే.

Advertisement

Next Story