- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైద్యులపై దాడులను ఖండించిన కళ్యాణి.. ట్రిబ్యూట్ అనుకుంటున్నారా?
దిశ, సినిమా : ప్రెట్టీ అండ్ బ్యూటిఫుల్ కళ్యాణి ప్రియదర్శన్ వైద్యులపై జరుగుతున్న దాడులను ఖండించింది. పేషెంట్‌ను సేవ్ చేయలేని డాక్టర్లను ఇంత దారుణంగా హింసించడం సమంజసం కాదని అభిప్రాయపడింది. తాను కూడా మెడికల్ నెగ్లిజెన్స్ సిట్యుయేషన్స్ ఎదుర్కొన్నానని, ప్రియమైన వారిని కోల్పోయానని తెలిపిన కళ్యాణి.. కానీ తాను ఇలా డాక్టర్లను కొట్టాలని, ఆస్పత్రిలో ఫర్నీచర్ ధ్వంసం చేయాలని ఎప్పుడూ అనుకోలేదని చెప్పింది. ఎందుకంటే ఒక్క చెడ్డ వైద్యుడుని ఫేస్ చేసిన తాను అందరు డాక్టర్లు కూడా అలాగే ఉంటారనే అభిప్రాయానికి రాలేదని తెలిపింది. డాక్టర్ల పట్ల తన ఒపీనియన్ చేంజ్ చేసుకోలేదని వివరించింది.
కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి రాత్రి – పగలు తేడా లేకుండా పనిచేస్తున్న మెడికల్ ఫ్రెటర్నిటీ పట్ల అంత చీప్‌గా ఎలా బిహేవ్ చేయగలుగుతున్నారని ప్రశ్నించింది. తనకు తెలిసిన డాక్టర్ ఫ్రెండ్స్ బయట అపార్ట్‌మెంట్స్ తీసుకుని కొవిడ్ డ్యూటీస్ చేస్తున్నారని, కొన్ని నెలలుగా తమ కుటుంబ సభ్యులను కలవకుండా జీవిస్తున్నారని తెలిపింది. ఇంత త్యాగం చేస్తున్న ఫ్రంట్ లైన్ వర్కర్స్‌కు మనం ట్రిబ్యూట్ ఇవ్వాలి కానీ ఆ నివాళి అనేది కొందరు పోకిరీలు దూసుకొచ్చి వారి తలలను పగలగొట్టేలా ఉండకూడదని అభ్యర్థించింది.