కరోనాకు భయపడొద్దు: హరీశ్‌రావు

by  |
కరోనాకు భయపడొద్దు: హరీశ్‌రావు
X

దిశ, సిద్ధిపేట: కల్యాణ లక్ష్మీతో.. పేదింటి ఆడబిడ్డల ఇంట్లో సీఎం కేసీఆర్ భరోసాను నింపారని మంత్రి హరీశ్ రావుఅన్నారు. సిద్ధిపేట పట్టణ పరిధిలోని కొండ భూదేవి గార్డెన్ లో శనివారం ఉదయం సిద్ధిపేట అర్బన్, మున్సిపాలిటీ పరిధిలోని 286 మంది లబ్ధిదారులకు రూ. 2 కోట్ల 86 లక్షల కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలోనే ఎక్కాడా లేని విధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మీ, షాదీ ముబాకర్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు భరోసాగా నిలుస్తున్నాయన్నారు.

అంతకుముందు మంత్రి లబ్ధిదారులు, పట్టణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కరోనా రాకుండా ఉండేందుకు తీసుకోవాలసిన ముందస్తు జాగ్రత్తలపై వివరించారు. కరోనా బాధితుల పట్ల సమాజంలో రావాల్సిన మార్పులు గురించి వివరించారు. కరోనా బారిన పడకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తే అసలైన మందని తెలిపారు. కరోనా అనగానే అతిగా భయపడాల్సిన అవసరం లేదన్నారు. అదే సమయంలో నిర్లక్ష్యం చేయకూడదన్నారు. ప్రస్తుతం కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుంది కావున అవసరమైతే తప్ప ఇంట్లోంచి బయటకు రావద్దని సూచించారు. తప్పనిసరై బయటికి వస్తే మాస్క్ ధరించాలన్నారు.


Next Story

Most Viewed