మెగా అల్లుడి షూటింగ్ మొదలు..

by Shyam |
మెగా అల్లుడి షూటింగ్ మొదలు..
X

మెగా అల్లుడు.. కళ్యాణ్ దేవ్ రెండో సినిమా ‘సూపర్ మచ్చి’. కన్నడ హీరోయిన్ రచితా రామ్ నటిస్తున్న చిత్రానికి పులి వాసు దర్శకత్వం వహిస్తున్నారు. లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత రామానాయుడు స్టూడియోస్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా.. ప్రస్తుత షెడ్యూల్‌తో పూర్తవుతుందని మూవీ యూనిట్ తెలిపింది. లాక్‌డౌన్ నిబంధనలకు అనుగుణంగా చిత్రీకరణ జరుగుతుండగా.. సినిమా సక్సెస్‌పై భారీ నమ్మకంతో ఉన్నారు నిర్మాతలు రిజ్వాన్, ఖుషీ.

హీరోహీరోయిన్లతో పాటు నటుడు అజయ్‌పై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందని.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెడతామని తెలిపారు. ఈ చిత్రంతో కళ్యాణ్‌దేవ్ క్లాస్, మాస్ ప్రేక్షకులకు దగ్గరవుతారని చెప్పారు. థమన్ స్వరాలు సమకూరుస్తున్న మూవీ ఆల్బమ్ సూపర్ హిట్ అవుతుందన్న నిర్మాతలు.. రాజేంద్ర ప్రసాద్, నరేష్, హీరోల మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయని తెలిపారు. కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితులు సాధారణం కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

Advertisement

Next Story