‘గాంధీని గాడ్సే చంపి మంచి పని చేశారు’

by Anukaran |   ( Updated:2021-12-28 00:30:27.0  )
Kasi-charan-maharaj
X

దిశ, వెబ్ డెస్క్: ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ దేశం లో హేట్ స్పీచ్ పెరుగుతోంది. మొన్న అసదుద్దీన్, నేడు కాళీచరణ్ మహారాజ్ ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రజల మనోభావాల పై ప్రభావం చూపేలా ప్రసంగాలు చేస్తున్నారు. తాజాగా ఛతీస్ గఢ్ రాజధాని రాయపూర్ లో జరిగిన సాదు సంతు సమావేశానికి హాజరైన కాళీచరణ్ గాంధీని చంపిన గాడ్సేకు వందనం అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాకుండా గాంధీని చంపేసి గాడ్సే మంచి పని చేశారని ఎద్దేవా చేశారు. దాంతో ఒక్క సారిగా రాజకీయ నాయకుల్లో అలజడి రేగింది. సోషల్ మీడియాలో దుమారం రేగింది.

అక్కడితో ఆగకుండా ఒక కట్టర్ హిందూ భావాలున్న వ్యక్తి ప్రభుత్వానికి అధినేతగా రావాలని అన్నారు. కాంగ్రెస్ సహా చాలా ప్రతిపక్ష పార్టీలు ఈయన మాటలను తీవ్రంగా ఖండించాయి. గాంధీ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు టిక్రాపారా స్టేషన్ లో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు అయినట్టు పోలీసులు తెలిపారు.

మంగ్లీకి చుక్కలు చూపించిన ఫ్యాన్స్.. కోపంతో ఆమె ఏం చేసిందంటే (వీడియో)

Advertisement

Next Story