కొట్టుకుపోయిన కన్నెపల్లి కెనాల్‌!

by Sridhar Babu |   ( Updated:2020-08-22 10:26:50.0  )
కొట్టుకుపోయిన కన్నెపల్లి కెనాల్‌!
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వం అంత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో అప్పుడే అపశృతి చోటుచేసుకుంది. ప్రాజెక్టు ప్రారంభించిన కొద్దిరోజులకే పనుల్లో డొల్లతనం బయటపడుతోంది. కన్నెపల్లి పంప్ హౌజ్ నుంచి అన్నారం బ్యారేజ్‌కు నీటిని తరలించేందుకు ఏర్పాటు చేసిన గ్రావిటీ కెనాల్ లైనింగ్ కొట్టుకపోవడంతో అధికారుల పనితీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కన్నెపల్లి నుంచి అన్నారం వరకు దాదాపు 12.5 కిలోమీటర్ల మేర కెనాల్ నిర్మాణం చేశారు. అయితే, కెనాల్ లైనింగ్ కొట్టుకపోవడంతో అధికారులు హుటాహుటిన పనులు చేయిస్తున్నారు. గత పది రోజులుగా వర్షాలు పడుతుండటంతో కన్నెపల్లి పంప్ హౌజ్ నుంచి నీటిని ఎత్తిపోయడం ప్రస్తుతానికి నిలిపివేశారు. ఒక వేళ నీటిని తరలిస్తున్న క్రమంలో లైనింగ్ పనులు కొట్టుకపోయినట్టయితే నష్టం మరింతగా ఉండేదని పలువురు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed