ఆర్టీసీ సర్వీసులు బంద్

దిశ, వెబ్‌డెస్క్: కడప నుంచి బెంగళూరు మధ్య నడిచే బస్సు సర్వీసులను ఇక నుంచి ఆదివారం నిలిపివేయాలని ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. దీంతో ఈనెల 12, 19, 26 తేదీల్లో ఆ రూట్లో బస్సు స‌ర్వీసులు నిలిచిపోనున్నాయి. ఆయా తేదీల్లో రిజర్వేషన్ చేయించుకున్న వారికి నగదు డ‌బ్బులు వాపసు చేస్తామ‌ని ఆర్టీసీ అధికారులు తెలిపారు. కొవిడ్-19 వ్యాప్తి ప్ర‌మాద‌క‌రంగా ఉన్నరీత్యా కర్ణాటక ప్రభుత్వం ప్రతి ఆదివారం బెంగళూరులో పూర్తి లాక్‌డౌన్ విధించింది. ఈ నేపథ్యంలోనే కడప టు బెంగళూరు రాకపోకలను నిలిపివేసినట్లు అధికారులు వెల్ల‌డించారు. కాగా, మిగతా రోజుల్లో స‌ద‌రు రూట్లో ఆర్టీసీ సర్వీసులు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టంచేశారు.

Advertisement