- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
పవన్ జీవితంలో సీఎం కాలేడు : కేఏ పాల్
దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పవన్ చెప్పే మాటలకు, చేసే పనులకు ఏమాత్రం సంబంధం లేదని వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల సమయంలో పవన్ పద్ధతులు బాగున్నాయని.. ఆయన పాలసీ బాగుందని చెప్పిన పాల్ ఇప్పుడు ఇలా మాట్లాడటం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఆయన వ్యాఖ్యలు ఆద్యంతం పవన్‌ను తూర్పారబట్టారు.
కేఏ పాల్ మాటల్లో.. జనసేన పార్టీతో పాటు జనసేనాని కూడా పెద్ద మోసగాడే అని అన్నారు. పవన్‌కు అసలు నీతి నిజాయితీ అనే మాటకు అర్థం కూడా తెలియదని.. కట్టుబాట్లులేని మనిషి అంటూ విమర్శించాడు. జనసేనలో పార్టీ నాయకులు ఆయన నిజస్వరూపం తెలిసాక బయటకు వెళ్లిపోతున్నారన్నారు.పవన్ కళ్యాణ్ అంటే తనకు గౌరవం ఉందని, తనకు తమ్ముడు లాంటి వాడంటూనే.. బీజేపీతో జనసేన పొత్తు విషయమై మండిపడ్డారు. కమలం పార్టీ అవసరానికి వాడుకుంటుందని తెలిసినా ఆ పార్టీతో జట్టుకట్టడం కంటే దిగజారుడు తనం ఉంటుందా.. అని ప్రశ్నించారు. 2014లో బీజేపీ-టీడీపీకి అలయన్స్‌కు మద్దతిచ్చాడని.. మొన్నటి ఎన్నికల్లో బీఎస్పీ, కమ్యూనిస్టులతో కలిసి తిరిగారన్నాడు. ఇప్పుడు కమ్యూనిస్టులను వదిలేసి అధికారకోసం బీజేపీ చెంతకు చేరాడని ఆరోపించాడు.
ఏపీలో కాపు సామాజిక వర్గం ఓట్లు పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ పవన్‌కు కనీసం 2శాతం ఓట్లు పడలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని పాల్ సూచించాడు. అంతేకాకుండా ‘పవన్ జీవితంలో సీఎం కాలేడని.. ఆయన డ్యాన్స్‌లు వేసుకోవడానికి సినిమాల్లోకి వెళ్లడమే మంచిదని’ పాల్ సెటైర్లు వేశాడు. ఇదిలాఉండగా కేఏ పాల్ చేసిన వ్యాఖ్యలపై జనసైనికులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఆయనపై విపరీతంగా ట్రోల్ చేస్తూ కామెంట్స్ పెడుతూ రెచ్చిపోతున్నారు.