‘జీ ప్లెక్స్‌’లో ఐష్, సేతుపతి మూవీ

by  |
‘జీ ప్లెక్స్‌’లో ఐష్, సేతుపతి మూవీ
X

దిశ, వెబ్‌డెస్క్: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి బిజీ యాక్టర్. ఆయన నటించిన ‘మాస్టర్’, ‘ఉప్పెన’ లాంటి సినిమాలతోపాటు దాదాపు పది సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. వీటిలో ‘కాపె రణసింగం’ ఒకటి. ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రానికి విరుమండి దర్శకత్వం వహించారు. ఇప్పటికే రిలీజ్ అయిన సినిమా ట్రైలర్ ట్రెండింగ్‌లో ఉండగా..చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది మూవీ యూనిట్.

స్టే హోమ్.. స్టే సేఫ్.. మీ ఇంటికే మా సినిమాను తీసుకువస్తున్నాం అని తెలిపిన మూవీ యూనిట్.. జీ ప్లెక్స్‌లో చిత్రం విడుదల కానున్నట్లు వెల్లడించింది. ఇండియాలోని ఐదు భాషల్లో సినిమా రిలీజ్ చేస్తున్నామని..పదికి పైగా ఇంటర్నేషనల్ భాషల్లో సబ్ టైటిల్స్ అరెంజ్ చేస్తున్నట్లు తెలిపారు. కేజేఆర్ స్టూడియోస్ బ్యానర్‌పై 150 దేశాల్లో విడుదల కాబోతున్న సినిమాకు మాసివ్ రెస్పాన్స్ ఖాయమని ధీమా వ్యక్తంచేశారు హీరో విజయ్ సేతుపతి. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామని తెలిపారు.


Next Story