- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘వివేకాను ఎవరు చంపారో ఆ ఇద్దరికి తెలుసు’
దిశ, ఏపీ బ్యూరో: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి కీలక సమాచారం అందించినవారికి సీబీఐ రూ.5 లక్షలు నజరానా ప్రకటించడంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాలో ఆదివారం పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ వివేకా హత్యకేసులో ఆధారాలిస్తే పారితోషికం ఇస్తామనడం సిగ్గుచేటంటూ మండిపడ్డారు. వివేకాను చంపింది ఎవరో పులివెందుల ఎమ్మెల్యే జగన్, కడప ఎంపీ అవినాశ్‌రెడ్డిలను అడిగితే చెబుతారని స్పష్టం చేశారు. ఈ హత్యకు సంబంధించి పూర్తి వివరాలు వారికి తెలుసునంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏళ్లతరబడి విచారణ చేస్తున్న కేసు విచారణ పూర్తికాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. సొంతింటి వారే ఈ హత్యకు పాల్పడ్డారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని రామకృష్ణ ఆరోపించారు.
76వ రోజుకు చేరుకున్న సీబీఐ విచారణ
మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ 76వ రోజుకు చేరుకుంది. ఆదివారం కడప జిల్లా సెంట్రల్ జైలు గెస్ట్‌హౌస్‌లో అనుమానితులను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. విచారణలో భాగంగా పులివెందుల మున్సిపాలిటీ సిబ్బంది గంగయ్య, సురేశ్‌లను సీబీఐ విచారిస్తోంది. అలాగే పులివెంందులలోని ఓ ప్రైవేట్ కళాశాలలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న జగదీశ్వరరావు అనే వ్యక్తిని సైతం సీబీఐ విచారిస్తోంది. ఇకపోతే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఖచ్చితమైన, నమ్మదగిన సమాచారం అందిస్తే రూ.5 లక్షలు నగదు బహుమతిగా ఇవ్వబడుతుందంటూ సీబీఐ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే.