‘ఆహా’లో జ్యోతిక డబుల్ ధమాకా!

by  |
‘ఆహా’లో జ్యోతిక డబుల్ ధమాకా!
X

దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ జ్యోతికకు, ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’కు మంచి అనుబంధం ఏర్పడింది. ఇప్పటికే ఆహాలో రిలీజైన తన ‘36 వయసులో’ చిత్రం.. ఆహా అనిపించగా శుక్రవారం మరో రెండు ఆహా అనిపించే సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. స్నేహాన్ని, మహిళా శక్తిని గురించి తెలిపే ‘బంగారు తల్లి, మగువలు మాత్రమే’ చిత్రాలు ఒకే రోజు(సెప్టెంబర్)న విడుదల కావడం చాలా సంతోషంగా ఉందని తెలిపింది జ్యోతిక.

‘సూపర్ సెప్టెంబర్’ పేరుతో ఆహా ఎంటర్‌టైన్మెంట్‌కు సిద్ధం కాగా.. తెలుగు ప్రేక్షకులు తనపై చూపిస్తున్న ప్రేమకు ఆనందంగా ఉందని తెలిపింది. రెండు వైవిధ్యమైన పాత్రలను ఆడియన్స్‌ను ఎంజాయ్ చేస్తారని.. బంగారు తల్లిలో వెన్నెలగా, మగువలు మాత్రమేలో ప్రభగా ప్రేక్షకులకు గుర్తుండిపోతానని అభిప్రాయపడింది. కాగా ఈ రెండు చిత్రాల ట్రైలర్లను విడుదల చేసిన సూర్య.. ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఆహాలో ప్రీమియర్ కాబోతున్న చిత్రాలను ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారని ధీమా వ్యక్తం చేశారు.



Next Story