నల్లజాతీయులకు క్షమాపణలు చెప్పిన జస్టిన్ బీబర్

by Shyam |
నల్లజాతీయులకు క్షమాపణలు చెప్పిన జస్టిన్ బీబర్
X

దిశ, సినిమా : పాప్ స్టార్ జస్టిన్ బీబర్‌ నల్లజాతీయులకు సారీ చెప్పాడు. సింగర్ మోర్గన్ వాలెన్ లేటెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ ‘డేంజరస్ : ది ఆల్బమ్ డబుల్’ను ప్రమోట్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టిన జస్టిన్.. ఆ తర్వాత డిలీట్ చేసి క్షమాపణలు కోరాడు. ఈ ఆల్బమ్‌లో రేసిస్ట్ కామెంట్స్ ఉపయోగించారని తనకు తెలియదని, అందుకే ప్రమోట్ చేశానని వివరణ ఇచ్చాడు. తాను జాత్యహంకారం, వివక్షకు మద్దతు ఇవ్వనని అలాగే వాటిని సహించనని హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపాడు. 2014లో రేసిస్ట్ జోక్‌తో ఆల్బమ్ వైరల్ అయిందని గుర్తుచేసుకున్న జస్టిన్.. అప్పుడు కూడా వెంటనే సారీ చెప్పానని తెలిపాడు. తనకు సపోర్ట్ చేస్తున్న బ్లాక్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్‌కు ధన్యవాదాలు తెలిపిన ఆయన.. నేర్చుకోవాల్సింది, చేయాల్సింది చాలా ఉందని చెప్పాడు.

Advertisement

Next Story

Most Viewed