- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎన్హెచ్ఆర్సీ చైర్మన్‌గా జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా
న్యూఢిల్లీ: జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు చైర్మన్(ఎన్‌హెచ్ఆర్‌సీ)గా సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా బుధవారం బాధ్యతలు తీసుకోనున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జస్టిస్ మిశ్రాను ఎన్‌హెచ్‌ఆర్‌సీ చైర్మన్‌గా నియమించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేలతో కూడిన ప్యానెల్ జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా పేరును ప్రతిపాదించింది. ఆదివాసి లేదా దళిత్ లేదా మైనారిటీ వ్యక్తిని ప్రతిపాదించాలన్న తన అభిప్రాయాలను పరిగణించలేదని ఖర్గే అసమ్మతి తెలిపారు. ఎన్‌హెచ్ఆర్‌సీ చైర్మన్ కోసం చేసిన షార్ట్‌లిస్ట్‌లో ముగ్గురు మాజీ సీజేఐలు ఉండటం గమనార్హం. గతేడాది ఫిబ్రవరిలో ఓ అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌లో జస్టిస్ మిశ్రా ప్రధానమంత్రి నరేంద్రమోడీని పొగిడి విమర్శలపాలయ్యారు.