- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కృష్ణమ్మ పరవళ్లు.. జూరాలకు వరద
దిశ, న్యూస్‌బ్యూరో: కృష్ణమ్మ పరవళ్లు మొదలయ్యాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో నదిలో ప్రవాహం ఉరకలేస్తోంది. ఆల్మట్టి ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ఆదివారం నాటికి 69,868 క్యూసెక్కులు వచ్చి చేరుతున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 129 టీఎంసీలు కాగా 95.5 టీఎంసీల నిల్వకు చేరింది. అయితే వరద కొనసాగుతుందని గుర్తించిన ప్రాజెక్టు అధికారులు దిగువకు నీటిని వదులుతున్నారు. ఆల్మట్టి నుంచి 36,130 క్యూసెక్కులు విడుదల చేయడంతో నారాయణపూర్ జలాశయానికి వరద చేరుకుంది. నారాయణపూర్ ప్రాజెక్టులోకి 39,720 క్యూసెక్కులు వస్తున్నాయి. 37 టీఎంసీల సామర్థ్యం ఉన్న నారాయణపూర్‌లో నిల్వ 34 టీఎంసీలకు చేరడంతో దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టు రెండు గేట్లు మీటరు వరకు ఎత్తి 11,240 క్యూసెక్కులను విడుదల చేశారు. ఆదివారం ఉదయం 11 గంటలకు గేట్లను ఎత్తారు. ఈ వరద ఎల్లుండి వరకు జూరాలకు వరద చేరనుంది. జూరాలకు ఇప్పటికే స్థానిక వరద వస్తోంది. జూరాలకు 4130 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. మరోవైపు నెట్టెంపాడు, బీమా, సమాంతర కాల్వ నుంచి 1445 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. అదే విధంగా తుంగభద్రకు వరద కొనసాగుతోంది. తుంగభద్ర జలాశయానికి 24,492 క్యూసెక్కులు వచ్చి చేరుతున్నాయి. ప్రస్తుతం తుంగభద్రలో 20టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలం ప్రాజెక్టుకు స్థానిక వరద 2,557 క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదవుతోంది. మరోవైపు గోదావరి బేసిన్‌లో ఎస్సారెస్పీకి వరద పెరిగింది. ఎస్సారెస్పీకి 11,102 క్యూసెక్కుల వదర వస్తుండగా, దిగువకు 1255 క్యూసెక్కులు వదులతున్నారు. 90 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఎస్సారెస్పీలో ప్రస్తుతం 33 టీఎంసీల నిల్వకు చేరింది. గోదావరి డెల్టాలో 1,23,122 క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదవుతుండగా, 1,24,974 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది.