భావోద్వేగానికి లోనైన ఎన్టీఆర్..!

దిశ వెబ్‎డెస్క్: దివంగత నటుడు నందమూరి హరికృష్ణ 64వ జయంతి సందర్భంగా.. ఆయన తనయుడు, హిరో జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. ట్విట్టర్ వేదికగా బుధవారం తన తండ్రికి నివాళులు అర్పించారు. “ఈ అస్థిత్వం మీరు. ఈ వ్య‌క్తిత్వం మీరు. మొక్క‌వోని ధైర్యంతో కొనసాగే మా ఈ ప్ర‌స్థానానికి నేతృత్వం మీరు. ఆజ‌న్మాంతం త‌లుచుకునే అశ్రుక‌ణం మీరే -నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌, నంద‌మూరి తార‌క రామారావు” అంటూ తండ్రి ఫోటోను పోస్టు చేశారు. మీ 64వ జయంతిన మిమ్మల్ని స్మరించుకుంటూ…. మిస్ యూ నాన్న‌’! అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు.

బాలనటుడిగా అడుగుపెట్టిన హరికృష్ణ.. సినిమాల్లోనే తనదైన ముద్ర వేసుకున్నారు. ఇటు రాజకీయాల్లోనూ అందరి మన్ననలు అందుకున్నారు. నేడు హరికృష్ణ జయంతిని పురస్కరించుకుని పలువురు ప్రముఖలు నివాళులు అర్పిస్తున్నారు. 2018 ఆగస్టు 29న ఓ రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మరణించిన సంగతి తెలిసిందే.

Advertisement