- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జర్నలిస్టులకు డబ్బులు ఇస్తున్నారు..
దిశ, తెలంగాణ బ్యూరో: వివిధ కారణాలతో మృతి చెందిన, దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్న జర్నలిస్టు కుటుంబాలకు జర్నలిస్టు సంక్షేమ నిధి నుంచి ఆదివారం జలవిహార్‌లో ఐటి, మున్సిపల్ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా చెక్కులు అందజేయనున్నట్లు ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. ఈరోజు ఆంధోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌తో కలిసి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. సిబ్బందికి తగు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ.. 87 మంది జర్నలిస్టు కుటుంబసభ్యులకు రూ. లక్ష, అనారోగ్య, ప్రమాదాల బారిన పడిన 18 మంది జర్నలిస్టుల ఫ్యామిలీస్‌కు రూ.50వేల చొప్పున చెక్కులను అందజేయనున్నట్లు వెల్లడించారు. ఆర్థిక సహాయం కోసం సంక్షేమ నిధికి వచ్చిన దరఖాస్తులను కమిటీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లబ్ధిదారుల ఎంపిక జరిగినట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో మీడియా అకాడమి కార్యదర్శి మహ్మద్ ముర్తుజా, మేనేజర్ లక్ష్మణ్ కుమార్, టియూడబ్ల్యూజే జనరల్ సెక్రటరీ మారుతి సాగర్, టెమ్జూ రాష్ట్ర అధ్యక్షులు ఇస్మాయిల్, ప్రధాన కార్యదర్శి రమణ తదితరులు పాల్గొన్నారు.