- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
విషాదం.. కరోనాతో జర్నలిస్టు మృతి
by Shyam |

X
దిశ, చేవెళ్ల : కరోనా పంజా విసరడంతో ఓ జర్నలిస్ట్ మృత్యువాత పడ్డాడు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో ‘వార్త’ దినపత్రికకు విలేకరిగా పనిచేస్తున్న లక్ష్మణ్‌కు వైరల్ ఫీవర్ రావడంతో స్థానికంగా మందులు వాడారు. ఈ క్రమంలో ఈనెల 16వ తేదీన పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
వెంటిలేటర్ పైన చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన స్వగ్రామం వికారాబాద్ జిల్లా పూడూరు కాగా 20 సంవత్సరాల క్రితం మొయినాబాద్ మండలం హిమాయత్ నగర్‌లో స్థిరపడ్డారు. విలేకరి లక్ష్మణ్ మృతి పట్ల జర్నలిస్టులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Next Story