- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కోహ్లీని కవ్వించకపోవడమే మంచిది: ఆసీస్ బౌలర్
by Shyam |

X
దిశ, స్పోర్ట్స్: ఈ ఏడాది చివర్లో భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరగనున్న సిరీస్‌లో కోహ్లీని కవ్వించకపోవడమే మంచిదని, అలా చేస్తే అతడు మరింత ప్రమాదకరంగా మారతాడని ఆసీస్ పేసర్ జోష్ హాజల్‌వుడ్ అన్నాడు. కోహ్లీ బ్యాటింగ్ చేసే సమయంలో కవ్వింపు చర్యలకు పాల్పడకూడదని తమ జట్టు నిర్ణయించుకున్నట్టు చెప్పాడు. అలా చేయడం వల్ల విరాట్‌లోని అత్యుత్తమ ఆట బయటకు వచ్చి తమ జట్టుకే నష్టం కలుగుతుందని చెప్పాడు. ‘కోహ్లీని రెచ్చగొట్టేందుకు మేం సాహసించం. అతని రెచ్చగొడితే ఏమవుతుందో 2018 సిరీస్‌లోనే అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం. కోహ్లీ కూడా ఆటలో పోటీని ఇష్టపడతాడు. ఇలాంటి సందర్భాల్లో అతను మరింతగా చెలరేగిపోతాడు. కోహ్లీ బ్యాటింగ్ చేసే సమయంలో స్లెడ్జింగ్ జోలికి వెళ్లకూడదు. బౌలర్లెవరూ ఆ పని చేయకూడదు’ అని హాజెల్‌వుడ్ సూచించారు.
Next Story